నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 13 : తంబళ్లపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ లో నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్ష కేంద్రానికి మొత్తం 175 మంది విద్యార్థులు కేటాయించగా 140 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 35 మంది గైర్హాజరయ్యారు. తెలుగు మీడియం 58 మంది, ఇంగ్లీష్ మీడియం 113 మంది, ఉర్దూ మీడియం నలుగురు హాజరు కాగా తెలుగు మీడియం లో 19 మంది, ఇంగ్లీష్ మీడియం లో 16 మంది గైర్హాజరు అయినట్లు ఎంఈఓ త్యాగరాజు తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు, మదనపల్లె నవోదయ పాఠశాల ప్రతినిధి సీసా, స్క్వాడ్ చాణుక్య పాల్గొనగా తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ నజీర్ భాష భద్రత ఏర్పాట్లు చేశారు.
Reporter
Namitha News