నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 04 ః తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ 7,44,790 లక్షలు లభించినట్లు దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట లు విలేకరులకు తెలిపారు. ఈ సందర్బంగా వారు శనివారం అధికార పార్టీ నాయకులు, దేవాదాయ శాఖ సభ్యులు, శివ భక్తుల సమక్షంలో గత మూడు మాసాల నుండి మహా శివుడికి భక్తుల నుండి వచ్చిన విరాళాలు ఆలయ ప్రధాన హుండీ, పలు హుండీల ద్వారా లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వరప్ప , మల్లికార్జున,దేవాదాయ శాఖ సభ్యులు, అధికార పార్టీ నాయకులు, శివ భక్తులు పాల్గొన్నారు.
Reporter
Namitha News