నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 09 : మదనపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలకు , అధికార యంత్రాంగం తోడు కావడంతో YSRCP వారు చిన్న పొరపాటును కూడా భూతద్దంలో చూస్తూ వేధింపులకు గురి చేయడం రివాజుగా మారిందని, మదనపల్లె చూట్టూ జరుగుతున్న భూ కబ్జాలు, ఫేక్ పట్టాలపై చర్యలు ఏవీ అంటూ మదనపల్లె YSRCP ఇంచార్జ్ నిస్సార్ అహమ్మద్ ప్రశ్నించారు మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లెకు చెందిన దళిత వికలాంగుడు, YSRCP సోషల్ మీడియా కన్వీనర్ రవితేజ ఇంటిపై JCB తో వెళ్ళి నిర్మాణాన్ని కుల్చివేసి బాత్రూమ్‌ను పూడ్చివేయడాన్ని తెలుసుకున్న మదనపల్లె నియోజకవర్గ YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ బాధితుడు రవితేజ కుటుంబాన్ని శనివారం పరామర్శించి, అండగా వుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.YSRCP సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న దళిత వికలాంగుడిపై దౌర్జన్యానికి పాల్పడటం, మహిళల పట్ల దౌర్జన్యం చేసే నైజం గా కూటమి ప్రభుత్వ అసలు స్వరూపం, ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ కక్షసాధింపుకు ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. మదనపల్లె చూట్టూ భూ కబ్జాలు, ఫేక్ పట్టాలు రాజ్యమేలుతోందని వీటిపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రంగం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తోందని మండిపడ్డారు. జగన్ 2.0 లో కార్యకర్తలకు అండగా నిలవడానికి డిజిటల్ బుక్ తీసుకుని రావడం జరిగిందని, ఇందులో నమోదు చేసి YSRCP ప్రభుత్వం అధికారంలోకి ఈ ఘటనతో బయటపడిందని అన్నారు. YSRCP కి చెందిన కార్యకర్తలు, నాయకులు చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపిస్తూ నిరంతరం వేధింపులు, అక్రమ కేసులు, దాడులు జరగడం రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని అణచివేత చర్యలకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. మదనపల్లె నియోజకవర్గంలో ముఖ్యంగా వచ్చిన వెంటనే న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. YSRCP వారిని సెకండ్ క్లాస్ పౌరులుగా చూస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బలహీన వర్గాల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వారి పైనే దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రవితేజ కుటుంబానికి YSRCP అండగా ఉంటుందని, ఈ ఘటనపై న్యాయపరంగా, ప్రజా ఉద్యమాల ద్వారా పోరాడతామని స్పష్టం చేశారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడే వారు భవిష్యత్ లో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, YSRCP మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, దావూద్, రఫీ, ముబారక్, అయూబ్, ఖాదర్ భాషా, ఎహసాన్, వీరయ్య, కొత్తపల్లి నాగార్జున నాయుడు, సాధిక్, విష్ణు వర్ధన్ రెడ్డి, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, అబ్దుల్లా, మాలేపాటి చలపతి, జబి, నజీర్, రియాజ్, నాగరాజ్ జాబీర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News