నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 30 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గెనికల సుబ్బారావుకు మిజోరం రాష్ట్రములోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వారు డాక్టరేట్ పట్టాను అందచేసినట్టు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. నేషనల్ ఇన్సూట్యూట్ అఫ్ టెక్నాలజీ, మిజోరాం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగము నుండి పిహెచ్‌డి డిగ్రీ పొందినట్లు, అక్కడే పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనుమోయ్ ఘోష్ పర్యవేక్షణలో డిజైన్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అబ్జార్బర్స్ ఫర్ మైక్రోవేవ్ / టెరా హెడ్జ్ అప్లికేషన్స్ అను అంశం పై చేసిన పరిశోధన కు గాను డాక్టరేట్ పట్టాను అందజేసినట్లు ఆయన అన్నారు. గెనికల సుబ్బారావును యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, విభాగాధిపతి అధ్యాపకులు మరియు తదితరులు అభినందనలు తెలియజేసారు
Admin
Namitha News