Monday, 27 July 2026 12:49:28 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వైద్య కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి - సీపీఐ

ఎన్నికల సమయం లో హామీ ఇచ్చి మాట తప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

Date : 14 January 2026 12:37 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 14 : రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలో పిపిపి విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జీవోలను భోగిమంటల్లో వేసి దగ్నం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి, పట్టణ కార్యదర్శి మురళి,కె.మాధవ్ ల అధ్యక్షతన మదనపల్లి సిపిఐ జిల్లా కార్యాలయం నందు భోగిమంటలలో జీవో పత్రాలను దగ్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు. ప్రతిపక్షంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైద్య విద్యకు పేదలకు దూరం చేసే పద్ధతుల్లో 107, 108 జీవోలను తీసుకువచ్చి వైద్య విద్యను 50% ప్రైవేటీకరణ చేస్తే అప్పటిలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వంద రోజుల్లో 107, 108 జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలలో భాగంగా జీవోలను రద్దు చేయకపోగా 100% వైద్య విద్యను పిపిపి విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. పిపీపి విధానం వల్ల కేవలం వైద్య విద్యార్థుల నష్టపోవడంతో పాటు సామాన్య ప్రజలు వైద్యం ఉచితంగా చేపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదన్నారు. వైద్య కళాశాల రాష్ట్రానికి వస్తే దాని పక్కనే ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాట అవుతుంది దానివల్ల సామాన్య ప్రజలు వైద్యం అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. పిపిపి విధానం వల్ల పేదలకు విద్యతోపాటు వైద్యం కూడా దూరం చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఒకవైపు లక్షలలో ఖర్చుపెట్టి ఇంటర్ తో పాటు నీట్ శిక్షణకు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసే చదివిస్తున్నారు నీటిలో అర్హతలు సాధించిన తరువాత వారికి పిపిపి విధానం వల్ల రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులో లేకుండా పోతాయని మండిపడ్డారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉండాల్సిన వైద్య విద్యను లాభాల కేంద్రంగా మార్చే ప్రయత్నం పిపిపీ విధానమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 590 ద్వారా 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాల్సిన ఈ వైద్య కళాశాలలను ప్రైవేట్ భాగ్యసామికే అప్పగించడం ప్రభుత్వ భూములు భవనాలు మౌలిక సదుపాయాలు ఆసుపత్రులు దీర్ఘకాలం పాటు ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిపిపీ విధానంలో యాజమాన్య కోటాలో సీట్లకు భారీ ఫీజులు విధించే అవకాశం ఉందని దీనివల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతుందని తెలిపారు, వైద్య విద్య సీట్లు పెరుగుతాయన్న ప్రభుత్వ హామీలు అపద్ధపు మాటలేనని విమర్శలు చేశారు, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణను వేగవంతం చేసినట్లే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్ 107, 108 ,590 రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు నాంది పలుకుతామని. ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలని భోగి మంటలలో వేసి దగ్నం చేశారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, సిపిఐ నియోజకవర్గ నాయకులు చంద్ర, శ్రీనివాస్ గౌడ, అంజాద్ గారు, మురళి గారు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :