నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 25 ః తంబళ్లపల్లె మండలం లోని పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఈనెల 27వ తేదీ ప్రాజెక్టు వద్దకు సాగునీటి చర్చా వేదికకు తరలిరావాలని పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పెద్దేరు ప్రాజెక్ట్ నిండి మొరవ పోతోందని ఆయకట్టులోని సుమారు నాలుగు వేల ఎకరాలు సాగు పై ఆయకట్టు రైతులతో రబీ సాగుపై చర్చా వేదిక జరుగుతుందని ఈ సమీక్షకు ఇరిగేషన్ ఈ.ఈ,డి.ఈ,ఎం.ఈ, ఆయ కట్టు కమిటీ సభ్యులు హాజరవుతారని ప్రాజెక్టు ఆయకట్టులో ప్రతి రైతు పంట సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రైతులు హాజరై సహకరించాలన్నారు.
Reporter
Namitha News