నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 14 : కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పై అవగాహన చెంది సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఎంపీ ప్రసాద్ కోరారు. గురువారం కేంద్ర ముద్ర యోజన, అటల్ బీమా యోజన, యోనా కృషి, అగ్రి గోల్డ్ లోన్, సంచాయి యోజన, అగ్రిగోల్డ్, స్వనిధి, సురక్ష బీమా, జీవనజ్యోతి, అగ్రి ఇన్ ఫ్రాక్చర్, ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకాల పై ఏవో థామస్ రాజా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కార్యదర్శులు ఈశ్వర్ రెడ్డి,శ్రీనివాసరావు, హరి ప్రసాద్, టిడిపి నాయకుడు బేరిపల్లి శ్రీనివాసులు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News