నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మార్చి 20 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2026 - జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా నిర్వహిస్తున్న ఎక్స్టర్నల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం ప్రారంభం అవుతాయని అని యూనివర్సిటీ వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు ఇందులో క్రికెట్, కబ్బాడి మరియు వాలీ బాల్ ఇతర ఆటల పోటీలకు నమోదు చేయని అభ్యర్థులు నేరుగా సోమవారం యూనివర్సిటీ నందు రిజిస్టర్ చేసుకోవచ్చని అన్నారు. ఇందులో జాతీయ స్థాయిలో డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని, వివరాలు కళాశాల అశ్వ్ వెబ్ సైట్ www.ashv2k.in లేదా www.mits.ac.in లో పొందుపరిచామని ఆయన అన్నారు. ఈ వెబ్ సైట్ నందు రిజిస్ట్రేషన్ వివరాలు మరియు పోటీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. ఇతర సందేహాల కోసం +91 9100601116 కు సంప్రదించవచ్చని తెలిపారు
Reporter
Namitha News