నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అట్టహాసంగా శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం - ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం - ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీహరి,డాక్టర్ భారతిలు స్పష్టం - హాజరైన వివిధ పార్టీల నాయకులు,పుర ప్రముఖులు గ్రామీణ,పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు,ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీహరి (ఎం.ఎస్),డాక్టర్ భారతిలు పేర్కొన్నారు.శుక్రవారం అన్నమయ్య కేంద్రమైన మదనపల్లి పట్టణం,సొసైటీ కాలనీ,రెండవ మెయిన్ నందు అధునాతన హంగులతో నిర్మితమైన నూతన భవనంలో ఆసుపత్రిని అట్టహాసంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి వివిధ పార్టీల నాయకులు,పుర ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ తాను గతంలో బెంగళూరు మణిపాల్ ఆసుపత్రి నందు జనరల్ సర్జనుగా పనిచేశానన్నారు.అనంతరం మదనపల్లి పట్టణంలో కదిరి రోడ్డు,రాఘవేంద్ర బుక్ స్టాల్ పక్కన ఉన్న భవనం నందు శ్రీ సాయి హాస్పిటల్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు.మా ఆసుపత్రి నందు అన్నిరకాల జబ్బులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు.ముఖ్యంగా ల్యాప్రోస్కోఫిక్ శస్త్రచికిత్సలు,క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స,అధునాతన సాంకేతిక విధానంతో నిర్వహించడం మా ప్రత్యేకత అన్నారు.అదేవిధంగా షుగర్ సంబంధిత జబ్బులకు ప్రత్యేక వైద్యం అందించబడుతుందన్నారు.దంతవైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.24×7 ప్రజలకు వైద్యసేవలు అందుతాయన్నారు.నూతన భవనంలో వైద్యసేవలు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని,తక్కువ ఫీజులతో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే తమ సంకల్పమన్నారు.మా ఆహ్వానం మేరకు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు,రాజకీయ ప్రముఖులు,ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం అందరికీ విందు భోజనం వడ్డించారు.
Reporter
Namitha News