నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 27 : తంబళ్లపల్లె మండలం లోని పెద్దేరు ప్రాజెక్ట్ ఆయకట్టు క్రింద నున్న ప్రతీ ఎకరం సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ కోరారు. గురువారం ప్రాజెక్టు ఆవరణంలో జరిగిన ఆయకట్టు రైతుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు కుడి కాలువ కింద 8.6 కిలోమీటర్లు ఎడమ కాలువ కింద 8.2 కిలోమీటర్లు సుమారు 4000 ఎకరాలు సాగుకు తీర్మాణించినట్లు తెలిపారు. రైతులు రబీ సీజన్ కు వేరుశనగ, మొక్కజొన్న, వరి, టమోటా, వాణిజ్య పంటలు వేసుకోవాలని సూచించారు. ఆయకట్టు రైతులు నీటి వృధా కాకుండా పంటలు సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు మెంబర్లు గంగిరెడ్డి, శివ నాగిరెడ్డి, తేజ మూర్తి నాయుడు, మాజీ సర్పంచ్ లు కృష్ణమూర్తి నాయుడు, రాము, మాజీ ఎంపిటిసి ఓబులేసు, జనసేన నరసింహులు, డీలర్ నారాయణస్వామి, ఉప సర్పంచ్ రాజన్న, వెంకటస్వామి, కాయలపల్లి మల్లికార్జున, శ్రీనివాసులు, కిట్ట, మల్లయ్య, లస్కర్ శ్రీనివాసులు రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News