నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 06 : తంబళ్లపల్లె మండలం లోని రైతులు రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడుతుందని ఈ సమస్యను అధిగమించడానికి వైవిద్యమైన పంటలను వేసి ఈ సవాలను ఎదుర్కోవాలని ఏఈఓ లు సురేష్, రెడ్డి శేఖర్, అంబేద్కర్ లు పిలుపునిచ్చారు. శనివారం తంబాలపల్లి మండల కేంద్రంలో ఎల్ నినో సమస్యను అధిగమించడం, ప్రకృతి వ్యవసాయంతో రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, భావితరాలకు నీటి సంరక్షణ, సరైన సమయంలో సరైన పంట వేయడం లాంటి సలహాలు సూచనలపై రైతులచే అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తంబళ్లపల్లి పురవీధుల్లో నిర్వహించి ఎల్ నినో సమస్య పై రైతులకు ఏఈఓ లు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల రెడ్డి, చిన్న రెడ్డి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News