నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 : తంబళ్లపల్లె కస్తూరిబా గాంధీ గురుకులం లోని టెన్త్ క్లాస్ విద్యార్థినిలు పబ్లిక్ పరీక్షల్లో సత్ఫలితాలు సాధనకు కృషి చేయాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ ఆకాంక్షించారు. బుధవారం కస్తూర్బా గురుకులంలోని టెన్త్ క్లాస్ లోని 37 మంది విద్యార్థినిలకు పరీక్షల కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఉత్తీర్ణత సాధించాలని ఉత్తేజపరిచి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కస్తూరిబా గురుకుల ప్రిన్సిపల్ శ్రీమతి మాట్లాడుతూ టెన్త్ విద్యార్థినిలకు పరీక్షల కిట్ అందజేసిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్ధిక్ తోబాటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి వారు చేస్తున్న సేవాభావం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కస్తూరిబా బాలికల గురుకుల విద్యాలయ ఉపాధ్యాయులు కాంచన, దీప, సుమతి, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పురుషోత్తం, దినకర్, బషీర్, సిరాజ్, కిరణ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News