Sunday, 26 July 2026 12:23:41 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

Date : 12 April 2026 09:15 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 12 : తంబళ్లపల్లె లోని టిడిపి నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంతో పార్టీకి అండగా నిలవాలని టిడిపి నియోజకవర్గ స్థాయి నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని ఎగువ బోయపల్లెలో కొడిగి మల్లికార్జున, కృష్ణమాచారి లా ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కట్టాదొరస్వామి నాయుడుకు పూలమాలలు, దృశ్యాలవులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ తంబళ్లపల్లె టిడిపికి అధిష్టానం త్వరలో ప్రజామోదం పొందిన నాయకుడిని ఎంపిక చేస్తారని కార్యకర్తలు అధైర్య పడాల్సిన పనిలేదని సమన్వయం పాటించి వర్గ విభేదాలు లేకుండా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూటమిపాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు పరుగులు పెడుతుందని ప్రశంసించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలుతోపాటు రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పరుగులు, విద్య, వైద్యం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోని మొదటి స్థానంలో నిలవడం ఖాయం అన్నారు. తంబళ్లపల్లె టిడిపి నాయకులు కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని ప్రతి కార్యకర్త పార్టీ ఆదేశాలకు కట్టుబడి అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. ఆయన వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :