నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నవంబర్ 06: ప్రైవేటు కేబుల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం పొంచిఉందని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె శ్రీకృష్ణ కళ్యాణ మండపం పరిధిలో లైఫ్ కేర్ మెడికల్ షాప్ ఎదురుగా విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లకు ప్రైవేట్ కేబుల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం పొంచిఉందని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైర్లను అమర్చడంతో కిందకు వేలాడుతూ వాహన దారులను ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలతో చెట్లువిరిగి విద్యుత్ ఫోల్స్ మీద పడటం తో కేబుల్ వైర్లు తెగిపోయాయి. వీటి మరమ్మతులకు కేబుల్ యజమానులు ఆఘమేఘాల పనులు చేస్తూ నిర్లక్షంగా వదిలి వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కేబుల్ వైర్లతో ప్రమాదం జరుగకుండా సంబంధిత కేబుల్ యజమానులతో సరి చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
Reporter
Namitha News