Sunday, 26 July 2026 08:28:08 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మదనపల్లి కలెక్టరేట్ నుండీ పరిపాలన ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

జిల్లా కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది.

Date : 01 January 2026 09:04 PM Views : 240

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 01 : డిసెంబర్ 31 నుండి అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి నుండి పరిపాలన ప్రారంభమైంది. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా మదనపల్లి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర్ కు వేద పండితులు వేదమంత్రాల ఉచ్చరణతో జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 లో అన్నమయ్య జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :