నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : మదనపల్లి పట్టణం లోని శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం ( మడికయ్యలశివాలయం) కు నూతన పాలకవర్గం ను ప్రకటించిన ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు పాలకవర్గం కమిటీ ప్రమాణ స్వీకారం ను ఘనంగా నిర్వహించారు. సభ్యులచే పదవీ ప్రమాణ చేయించిన కార్యనిర్వహణ అధికారి. ప్రమాణ స్వీకారం కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. చైర్మన్‌గా నియమితులైన కొప్పాల వెంకటరమణ తో పాటు సభ్యులు గా సి.భవాని, డి.మల్లికా రాణి, నాగ రమ్య, సి.మల్లిక, పసుపులేటి వరప్రసాద్, బి.శివకుమార్, ప్రకాష్ నాయుడు, లక్ష్మీ నరసింహమూర్తి లు ప్రమాణ స్వీకారం అనంతరం వీరిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నూతన పాలకవర్గం దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News