నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 11 : మదనపల్లె లో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సమావేశం శనివారం జరిగింది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్న ర్యాలీ, పికెటింగ్ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ కె. హేమలత, గణేష్ భూపతి, మధుబాబు, విజయ్‌కుమార్, నరసింహులు, పురం వెంకటరమణ, రవిప్రకాశ్‌తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News