నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 16 : తంబళ్లపల్లె మండలం దిగువపాలెం పంచాయతీ కి చెందిన విద్యార్థి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని దిగువపాలెం చింతల రేవుపల్లెకు చెందిన వడ్డిపల్లి దామోదర కుమారుడు వడ్డిపల్లి రాజు (15) ములకలచెరువు మండలం వేపూరు కోట లోని హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియం పదవ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు లో భాగంగా రాజు శనివారం పాఠశాలకు చింతల రేవు పల్లె నుండి నుండి బస్సులో వేపూరు కోటకు వెళ్ళాడు. అక్కడ గ్రామస్తులకు సైతం కనపడ్డాడు. సాయంత్రం రాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది సంబంధిత పాఠశాల టీచర్ ను విచారించగా రాజు పాఠశాలకు రాలేదని చెప్పారు. అనంతరం బంధువులు ఇళ్ళల్లో వెతికిన ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం రాజు తండ్రి దామోదరం తంబళ్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Reporter
Namitha News