నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 28 : పాడి రైతులు పశు బీమా, పెయ్య దూడల సూదులను సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లె పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ రసూల్ సాబ్ సూచించారు. బుధవారం ఆయన గుండ్లపల్లి, ఎగువ బోయపల్లెలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పసు ఆరోగ్యశిబిరాలను సందర్శించారు. ఈ శిబిరంలో 187 పశువులకు బ్యూటాక్స్ పిచికారి, 38 పశువులకు గర్భకోశ వ్యాధిచికిత్స, 130 పశువులకు నట్టల నివారణ మందు తాపించారు. ఈ సందర్భంగా డిడి మాట్లాడుతూ రూ 300 చెల్లించి మూడేళ్లు కాలానికి రూ 30వేలు బీమా, గొర్రెలకు రూ 60 లతో రూ 6000 బీమా పొందవచ్చని అవకాశాన్ని సద్విని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి డాక్టర్ సుమిత్ర, మండల డాక్టర్ విక్రమ్ రెడ్డి, అంబులెన్స్ డాక్టర్ ఇందు, సహాయకులు భాస్కర్ రెడ్డి, సాదిక్ భాషా, కిరణ్, ప్రవీణ్, రమేష్ పాడిరైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News