నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఏఎంసీ చైర్మన్ల కమిటీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవాల్లో పాల్గొన్న నాయకులు : రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ల కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ల కమిటీ అధ్యక్షుడు హరిబాబు, ఉపాధ్యక్షుడు జంగాల శివరాం, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, పీలేరు ఏఎంసీ చైర్మన్ పురం రామ్మూర్తితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువాతో సన్మానం చేసి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్యుల సమక్షంలో కేక్ కట్ చేసి విజయోత్సవాలను నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడఅమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి ప్రసాద్ ఆధ్వర్యంలో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, పీలేరు ఏఎంసీ చైర్మన్ పురం రామ్మూర్తి, పీలేరు జనసేన ఇన్‌చార్జి దినేష్, పుంగనూరు జనసేన ఇన్‌చార్జి చిన్న రాయల్, తంబళ్లపల్లి జనసేన ఇన్‌చార్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, మార్కెట్ కమిటీల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రులతో చర్చించినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ల కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News