నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 28 : తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు అధైర్యపడవద్దని మీకు నేను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ తంబళ్లపల్లె మండల టిడిపి నాయకులకు భరోసా ఇచ్చారు. గురువారం తంబళ్లపల్లె మండలం లోని టిడిపి నాయకులు మొలకలచెరువు లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ను కలిసి దుశ్యాలవులు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వారి అభిమానానికి మురిసిపోయిన జి శంకర్ యాదవ్ భావోద్వేగంతో కార్యకర్తలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అభినందించారు. నడిపించే నాయకుడు లేక మన ప్రభుత్వం అధికారం ఉన్నా నిర్లక్ష్యానికి గురి అవుతున్నామని నీ రాక కోసం ఎదురుచూసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నాయకులు మూకుమ్మడిగా కోరారు. దీనిపై స్పందించిన జి శంకర్ యాదవ్ మనకు మంచి రోజులు వస్తున్నాయి తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటలో నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో తంబళ్లపల్లె టిడిపి నాయకులు, కార్యకర్తలు హర్షద్వానాలతో మారు మ్రోగించారు. మాజీ ఎమ్మెల్యేని క్లస్టర్ ఇంచార్జ్ కాల నారాయణ, పురుషోత్తం, దండువారిపల్లి రమణ, వీరాంజనేయులు, గంగుల్ రెడ్డి,సోమశేఖర్, గోపి దిన్ని సుధాకర్, రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, సురేంద్ర, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News