Sunday, 26 July 2026 04:50:21 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

దార్శనిక నేత,అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు - టిడిపి నేతలు కట్టా దొరస్వామి నాయుడు,నాగూర్ వలి ప్రశంసలు

Date : 20 April 2026 08:32 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దార్శనిక నేత,అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు - టిడిపి నేతలు కట్టా దొరస్వామి నాయుడు,నాగూర్ వలి ప్రశంసలు - ములకలచెరువులో ఘనంగా సిబిఎన్ పుట్టినరోజు వేడుకలు మదనపల్లె : దార్శనిక నేత,అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని టిడిపి నేతలు పేర్కొన్నారు.తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కట్టాదొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ములకలచెరువులో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనం జరుపుకున్నారు.ఈ వేడుకులకు తంబళ్లపల్లి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ సాయినాథ్,మదనపల్లి ఆర్టీసీ 1,2 డిపోల గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),హరినాథ్ రావు,లక్ష్మీనారాయణ,పాలగిరి సిద్ధా తదితరులు హాజరయ్యారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దొరస్వామి నాయుడు,నాగూర్ వలిలు మాట్లాడుతూ 76 సంవత్సరాల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి,ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.ఆయన విజన్ దేశానికి ఆదర్శమని కొనియాడారు.ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ ఓ యువకుడిలా ఆయన కనబరుస్తున్న పనితీరు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.ఆయన సారధ్యంలో ఏపీ అన్నిరంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు.ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి పోలవరం,ప్రజా రాజధాని అమరావతి శరవేగంగా జరుగుతున్నాయన్నారు.తన తనయుడు మంత్రి నారా లోకేష్ బాబుతో కలిసి నవ్యాంధ్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరికొన్ని సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: