నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలికిరి - జనవరి 30 : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలికిరి మండలం మహల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి సంబంధించిన ఓపి రిజిస్టర్, డిస్పెన్సరీ రిజిస్టర్ తదితర రిజిస్టర్ లను పరిశీలించి ఆసుపత్రి సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు. చిన్న పిల్లలకు టీకాలు ఎప్పుడు ఎప్పుడు వేస్తున్నారు ఎలా వేస్తున్నారు వంటి ప్రశ్నలు అడిగారు. చిన్న పిల్లలకు వేసే టీకాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారా లేదా టీకాలు వేసే తేదీలపై ప్రజలకు ముందుగానే తెలియజేస్తున్నారా లేదా వంటి ప్రశ్నలను ఆసుపత్రి సిబ్బందిని అడిగారు. సిబ్బంది కొరత ఏమైనా ఉంటే వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపి పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్ను పరిశీలించి ప్రజలకు అన్ని రకాల వసతులు ఉండాలని, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆపరేషన్ జరిగేలా చూడాలన్నారు. స్త్రీలలో రక్తహీనత లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల నేటి వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలపై సిబ్బందిని అడిగి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వసతులు బాగా ఉండాలని, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
Admin
Namitha News