నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్బంగా ఘన సన్మానం, శుభాకాంక్షలు తెలిపిన పుంగనూరు బిజెపి నాయకులు. అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పులి నరేంద్ర కుమార్ రెడ్డి గారిని పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ మరియు పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మదనపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ మదన్ బాబు ఆధ్వర్యంలో నరేంద్ర కుమార్ రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నాయకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు
Reporter
Namitha News