నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 21 : సత్యసాయి జిల్లా తనకల్లు ప్రభుత్వ వైద్యధికారి గా ఉద్యోగం నిర్వహిస్తూ కదిరి పట్టణం లో నివాసం ఉన్న డాక్టర్ దంపతులు విజయబాబు, నందిని లు. ఫిబ్రవరి 12వ తేదీన మెట్లు పై నుండీ పడిపోయి చనిపోయిన బాలుడు వర్షిత్. విషాదం లో భార్య మాటలు నమ్మి కొడుకు మృతదేహం ను స్వగ్రామం మైన మదనపల్లి మండలం అంకిశెట్టి పల్లి కి తీసుకొచ్చి ఇంటి వద్ద నే ఖననం చేసి వెళ్లారు. కొద్దిరోజుల తర్వాత భర్త తో గోడవ పడి అలిగి పుట్టింటికి వెళ్లన భార్య నందిని. ఆమె ప్రవర్తన పై అనుమానం వచ్చి తన కొడుకు వర్షిత్ మృతి పై అనుమానం వ్యక్తం చేస్తూ భార్య నందిని పై కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి డాక్టర్ విజయబాబు. తండ్రి ఫిర్యాదు పై అనుమానస్పద మృతి గా కేసు నమోదు చేసిన కదిరి పట్టణం పోలీసులు.శుక్రవారం మదనపల్లి తహసీల్దార్ సమక్షంలో పాతిపెట్టిన బాలుడి మృతదేహం వెళికితీసి పోస్టుమోర్టుమ్ నిర్వహించారు. పోస్టు మోర్టుమ్ నివేదిక అనంతరం తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించిన కదిరి ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి
Admin
Namitha News