నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 03 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కు చెందిన ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సి. దామోదరన్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారని యూనివర్సిటీ వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. చెన్నైలోని ఎస్.ఆర్.ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన “3వ అంతర్జాతీయ సదస్సు – అడ్వాన్స్‌డ్ స్పోర్ట్స్ సైన్స్ & ఇంటెలిజెన్స్ పెర్ఫార్మెన్స్ టెక్నాలజీస్ (SPORTINTEL 2026)” కార్యక్రమంలో డాక్టర్. సి. దామోదరన్ “శారీరక విద్య మరియు క్రీడా విజ్ఞాన శాస్త్రాల పాత్ర – ఆరోగ్యం, ఫిట్‌నెస్ మరియు జీవితాంతం చురుకైన జీవన విధానం” అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో మూడవ స్థానంలో కాంస్య పతకం లభించిందని తెలిపారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అకాడమిషియన్లు, పరిశోధకులు, క్రీడా నిపుణులు పాల్గొని క్రీడా విజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలపై తమ పరిశోధన పత్రాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఆర్.ఎమ్ యూనివర్సిటీ అడిషనల్ రిజిస్ట్రార్ డాక్టర్ టి.మైథిలి కాంస్య పతకం మరియు సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రతిభ చూపిన డాక్టర్ సి. దామోదరన్ ను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Admin
Namitha News