Monday, 27 July 2026 04:19:40 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రకృతి పెరటి తోట పంట పండింది - పరవశించిన అధికారులు

మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ప్రశంసలు

Date : 27 February 2026 07:56 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 27 ః తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో రెండు మాసాల క్రితం స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి ప్రయోగాత్మకంగా ప్రకృతి పెరటి తోట పెంపకం ప్రారంభించారు. ఆయన స్ఫూర్తితో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ ఎంఈఓ త్యాగరాజు సూచనలతో ప్రకృతి ఎరువులతో పెరటి తోట పెంపకం చేపట్టి సత్ఫలితం సాధించారు. శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి, కోసువారిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సాదియాలు పెరటి తోటలోని పండిన పంటను చూసి పరవశించిపోయారు. తోటలో పండిన ముల్లంగి, ఆకుకూరలను పరిశీలించి మోడల్ స్కూల్ సిబ్బందిని ప్రశంసించారు. రసాయన ఎరువులతో పండిన పంటలతో ఆరోగ్యాలు క్షీణిస్తాయని మోడల్ స్కూల్ లో ప్రకృతి జీవన ఎరువులు తో పండించిన వ్యవసాయ పంట అందరికీ ఆదర్శంగా నిలిచినట్లు కొనియాడారు. మోడల్ స్కూల్ పెరటి తోట ఓ రోల్ మోడల్ గా నిలిచిందని వీరిని ఆదర్శంగా తీసుకొని పాఠశాలు, సచివాలయాలు, ఇంటి పెరడులు, రైతులు ప్రకృతి వ్యవసాయ పంటలపై దృష్టి సారిస్తే జిల్లాకే ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా వారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బందిని ప్రశంసించారు. వారి వెంట వైద్య సిబ్బంది, మోడల్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :