Sunday, 26 July 2026 01:40:24 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఘనంగా సిపిఐ 101వ వ్యవస్థాపక దినోత్సవం

Date : 26 December 2025 02:39 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 26 : భారత కమ్యూనిస్టు పార్టీ 101 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారంవారం ఉదయం 10 గంటలకు చిన్నతిప్పసముద్రం గ్రామ శాఖ మరియు మదనపల్లె పార్టీ కార్యాలయంవద్ద జెండా దిమ్మె లు వద్ద సిపిఐ *జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఇటీవల మరణించిన సిపిఐ నాయకులు ఎర్రజెండా నీడన ఒరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలని,ఇంక్వి లాబ్ జిందాబాద్, క్యాపిటలిజం నశించాలని, సోషలిజం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. లాల్ జెండా పోరాటాలకు నీల్ లాల్-నీల్ జెండాలు ఏకమై బడుగుబలహీన వర్గాల సమస్యలమీద ఐక్య పోరాటాల కోసం తాము ఇప్పుడు ముందు ఉంటామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి కే మురళి లు మాట్లాడుతూ నాడు బ్రిటిష్ పాలకుల నిర్బంధ కాండకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925 డిసెంబర్ 26న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భించిందని,గడచిన 100 ఏళ్ల కాలంలో ఎన్నో విరోచిత పోరాటాలు, మహోన్నత త్యాగాలు, మహత్తర విజయాలకు సిపిఐ ప్రతీకగా నిలిచిందన్నారు.అనేక కుట్రలు,కుతంత్రాలు, దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా ఎందరో నేతలు జైలుకు వెళ్లడం,ఉరికంబం ఎక్కడం ద్వారా స్వాతంత్ర్య సమరంలో అగ్రభాగాన ఉండి పోరాడిన చరిత్ర సిపిఐకే దక్కుతుందని అన్నారు.నాడు తెల్లదొరతనాన్ని తరిమికొట్టినప్పటికీ నేడు నల్ల దొరతనం రాజ్యమేలుతోందని, ఏనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఛాయలు కనిపించని ఆర్.ఎస్.ఎస్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకుని చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వాన్ని దాని సహవాస పార్టీలను గద్దెదించాలనే సంకల్పంతో, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికవ్యవస్థను పరిరక్షించుకునే ఆశయంతో కమ్యూనిస్టులు కంకణబద్దులు కావలసిన తక్షణవసరం ఉందని అన్నారు. అనంతరం పార్టీ నియమాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మదనపల్లె మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ సిపిఐ మదనపల్లె పట్టణ కార్యదర్శి జి చంద్రశేఖర్ మాధవ్ శాఖ కార్యదర్శి కే సిద్దయ్య గోపాల్ నిళవతి రాజమ్మ భాగ్యమ్మ వెంకటమ్మ పాపుల్లమ్మ శివుణ్ణి మల్లేష్ గజేంద్ర రమణమ్మ నాగరత్నమ్మ క్రిష్ణప్ప మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :