Monday, 27 July 2026 03:31:13 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఏ.ఐ. లెర్నింగ్ హబ్ ప్రారంభం

Date : 26 May 2026 08:01 PM Views : 78

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులలో కృత్రిమ మేధస్సు (AI) పై అవగాహన పెంపొందించేందుకు మిట్స్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (SAC) ఆధ్వర్యంలో “ఏ.ఐ క్లబ్ – ఏ.ఐ లెర్నింగ్ హబ్” కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని మారుస్తున్న అత్యంత శక్తివంతమైన సాంకేతికతగా ఎదుగుతోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి రంగంలో ఏ.ఐ కీలక పాత్ర పోషించనున్నందున, ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ.ఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ వంటి సాంకేతిక నైపుణ్యాలను అభ్యసించడం అత్యంత అవసరమని అన్నారు. విద్యార్థులకు వినూత్న ఆలోచనలు, పరిశోధన, సాంకేతిక అభ్యాసం మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను అందించే అద్భుత వేదికగా ఏ.ఐ లెర్నింగ్ హబ్ నిలుస్తుందని తెలిపారు. ఈ క్లబ్ ద్వారా హ్యాకథాన్లు, వర్క్‌షాపులు, కోడింగ్ శిక్షణలు, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాస కార్యక్రమాలు, ఇండస్ట్రీ నిపుణులతో ఇంటరాక్షన్ సెషన్లు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, టీమ్‌వర్క్ మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. భవిష్యత్తులో ప్రతి రంగంలో ఏ.ఐ వినియోగం పెరుగుతున్నందున, ఏ.ఐ టూల్స్‌పై అవగాహన కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ, మెరుగైన ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు, స్టార్టప్ అవకాశాలు మరియు పరిశోధన రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, స్టూడెంట్స్ ఆక్టివిటీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.రెడ్డి హేమంత, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ షేక్ టిప్పు రెహమాన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :