నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - నవంబర్ 15 : అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గం ఇంచార్జి జగన్మోహన్ రాజు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించాలని రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో టిడిపి నాయకులు, అధికారులు, కార్యకర్తలతో కలిసి పరిశుభ్రం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద డేగా ప్రకటించిందని, అటు అధికారులతో పాటు ఇటు నాయకులు ప్రజలు కూడా స్వచ్ఛ్ ఆంధ్రలో భాగంగా తమ పరిసరాల్లో ఎటువంటి అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట టిడిపి పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, రూరల్ అధ్యక్షుడు మేడికొండ రవి నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, మున్సిపల్ టిడిపి ఫ్లోర్ లీడర్ తుపాకుల అశోక్, గుణకల చిన్న, హాస్పిటల్ సూపర్నెంట్ నాగేశ్వర రాజు, డాక్టర్ అనిల్, హాస్పిటల్స్ సిబ్బంది, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటేశ్వర్ల నాయుడు, కొల్లి రెడ్డయ్య నాయుడు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు,కళాధర్, సురేంద్ర నాయుడు, సతీష్ రాజు, రమణ రాజు, పాండురాజు, తేజాల ఆనంద్, పోలీ శివకుమార్ పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News