నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ఆగస్టు 15లోగా మంజూరైన గృహాల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్న హౌసింగ్ పీడీ రమేష్‌రెడ్డి.. పుంగనూరు నియోజకవర్గానికి 1,442 గృహాలు మంజూరయ్యాయని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 4,336 మందిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుర్తించి నమోదు చేసినట్లు చెప్పారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారందరికీ గృహాలు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు.పుంగనూరు లో ఇంటి స్థలాలు లేని 580 మందిని గుర్తించి నమోదు చేశామని, వారికి తదుపరి దశలో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.పట్టణ ప్రాంతాల్లో స్థలం కలిగిన అర్హులకు రూ.2.50 లక్షల వ్యయంతో గృహాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.అర్బన్ ప్రాంతాల్లో సరైన పత్రాలు ఉన్న లబ్ధిదారులకు గృహాల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 4,339 మంది లబ్ధిదారుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.గృహాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు.సమావేశంలో హౌసింగ్ డీఈ దీనదయాళ్‌రాజు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News