నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఫిబ్రవరి 15: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ వెలసిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర తెలుగు యూత్ అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాల మధ్య ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, భక్తులు భక్తి శ్రద్ధలతో శివారాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు, రన్ టీవీ చైర్మన్ సిరివెలు చరణ్, టిడిపి నాయకులు తులసీదర్, చంద్రశేఖర్, ఈశ్వర, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, జెసి రెడ్డప్ప, బిజెపి నాయకులు శ్రీకాంత్, రాయల్, చంటి రాయల్, విష్ణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి శివనామ స్మరణ చేస్తూ మల్లికార్జున స్వామి సేవ లో పాల్గొన్నారు
Reporter
Namitha News