నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె మే 06 : మదనపల్లి పట్టణం సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు బి.టెక్ మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా సెంట్రల్ సెక్టర్ స్కాలర్‌షిప్ పథకానికి ఎంపిక కావడం గర్వకారణమని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ స్కాలర్‌షిప్ కింద ఇద్దరు విద్యార్థులకు రూ.25,000 చొప్పున, మిగతా 13 మంది విద్యార్థులకు రూ.12,000 చొప్పున మొత్తం రూ.2,06,000 /- ఆర్థిక సహాయం లభించింది. తక్కువ ఆదాయం గల కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను నిరాటంకంగా కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించడమే ఈ సెంట్రల్ సెక్టర్ స్కాలర్‌షిప్ పథక ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సల్లర్ యన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, సీనియర్ మేనేజర్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ అథాహర్ సమీనా, రాగ దీప్తి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Admin
Namitha News