Monday, 27 July 2026 12:50:14 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ విద్యార్థులకు విదేశీ విద్య పై అవగాహన

Date : 27 April 2026 09:21 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 27 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరు కు చెందిన వాట్ నెక్స్ట్ ఓవర్సీస్ సంస్థ, బిజినెస్ అండ్ స్ట్రాటజీ హెడ్, సచిన్ సోని పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించే విద్యార్థులకు ప్రత్యక్షంగా విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే స్కాలర్‌షిప్ లు అందిస్తున్నాయని అన్నారు. ఉన్నత విద్య కోసం ముందస్తు ప్రణాళికగా జి.ఆర్.ఇ, టోఫెల్, ఐ.ఇ.ఎల్.టి.ఎస్ వంటి పరీక్షలపై అవగాహన మరియు సమయానికి దరఖాస్తులు పంపడం వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కలిపించారు. విద్యార్థుల విద్యార్హతలు, ఆసక్తి మరియు కెరీర్ లక్ష్యాలను బట్టి సరైన యూనివర్సిటీ మరియు కోర్సు ఎంపికలో సహకరిస్తామని అన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో అధునాతన తయారీ సాంకేతికతలు, రోబోటిక్స్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ వంటి ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం పొందడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్‌లు, స్టైపెండ్లు ద్వారా అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు.. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన సదుపాయాలు మరియు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి జ్ఞానం లభిస్తుందని అన్నారు. విదేశాల్లో ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలు, పరిశోధన మరియు ఇన్నోవేషన్‌లో పాల్గొనే అవకాశం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం అని అన్నారు. కార్యక్రమంలో డీన్-అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత బసు, సీనియర్ మేనేజర్-యూ.విజయ లక్ష్మి, సంస్థ ప్రతినిధులు ఆదిత్య సోమనాథ్, సాయంతని రాయ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :