Monday, 27 July 2026 02:43:08 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భక్తులపై దౌర్జన్యం కు పాల్పడితే కఠిన చర్యలు - డిఎస్పీ మహేంద్ర

Date : 04 February 2026 08:58 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఫిబ్రవరి 04 : బోయకొండ గంగమ్మ భక్తులపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి డిఎస్పి మహేంద్ర గారు తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం రోజు ఓ మహిళ భక్తురాలపై సుమో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించి దౌర్జన్యం చేసిన విషయం పై ఈరోజు అనగా 4-2-2025వ తేదీ చౌడేపల్లి సర్కిల్ పోలీస్ ఆఫీస్ నందు బోయకొండలో మాంసం కటింగ్, సుమో డ్రైవర్లు, ఆటోల డ్రైవర్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది. బోయకొండ గంగమ్మ భక్తులపై గాని మహిళా భక్తులపై గాని చిన్న పిల్లలపై గాని ఎలాంటి గలాటాలు దౌర్జన్యాలు అసభ్యకర ప్రవర్తనలు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బోయకొండకు భక్తులు వస్తేనే అక్కడ ఉన్నవారికి జీవనోపాధి ఆదాయాలు ఉంటాయి కాబట్టి భక్తులపై గౌరవంగా మర్యాదగా నడుచుకోవాలని అవగాహన కల్పించారు. ప్రతి సుమో డ్రైవర్ ఆటో డ్రైవర్ మాంసం కటింగ్ చేసేవారు వారి ఆధార్ కార్డు ఫోటో ఫోన్ నెంబర్లు పోలీస్ స్టేషన్లో ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ ను తీసుకున్న వారు మాత్రమే బోయకొండలో మాంసం కటింగ్ చేసుకోవాలని ఆటోలు సుమోలు నడుపుకోవాలని ఆదేశించారు. అలాగే ఈరోజు మహిళపై అత్యాయత్నం కూడా జరగడంతో వారిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మద్యం సేవించి ఆటోలు సుమోలు నడపడం బోయకొండలో విధులు నిర్వహించడం వ్యాపారాలు చేయడం చేసిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తీవ్రంగా హెచ్చరించారు. స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు మటన్ కటింగ్ చేసేవారు ప్రతి ఒక్కరూ భక్తులను మహిళలను చిన్నపిల్లలను గౌరవించడం సాంప్రదాయంగా ఉండాలని సూచించారు. ఆలయ ప్రతిష్ట దెబ్బ తినకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలయ ప్రతిష్ట పెంపొందించాలని సూచించారు అలాకాకుండా ఎలాంటి దౌర్జన్యాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కౌన్సిలింగ్ కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ , ఎస్సై నాగేశ్వరరావు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :