నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 21 : పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం విజయవంతంగా ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హిందువులు, ప్రజలు తరలిరావడంతో సభాస్థలి జనసంద్రంగా మారింది. పట్టణ వీధుల గుండా సాగిన ర్యాలీలో పాల్గొన్న వారు కాషాయ రంగు జెండాలను చేతబట్టి హిందూ ఐక్యతను చాటిచెప్పారు. సభాస్థలిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క భజనలు ప్రత్యేక నిలిచాయి. వివిధ కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమాలు హాజరైన వారిని అలరించాయి. ఈ సమ్మేళనానికి హిందూ మత పెద్దలు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణతో పాటు హిందువుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడమే ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రఘునాథ శాస్త్రి త్రిమూర్తుల రెడ్డి విజయ శంకర్ బాలసుబ్రమణ్యం సుకుమార్ బాబు మనీ ప్రేమ్ శివ తదితర హిందూ సంఘాల ప్రతినిధులు సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Namitha News