Sunday, 26 July 2026 10:06:09 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ?

అధిష్టానం నుండి పిలుపు తో తంబళ్లపల్లె లో సంబరాలు

Date : 28 February 2026 09:17 PM Views : 341

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 28 : తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఎంపిక ఖరారు అయినట్లు అధిష్టానం నుండి సంకేతాలు అందాయి. శనివారం తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల లోని టిడిపి నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లి విరిసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన మండల స్థాయి నాయకులతోపాటు కార్యకర్తలు తమ పనులు జరగక పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు, జిల్లా, ఇంచార్జ్ మంత్రులకు నాయకులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. జయచంద్ర రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ కావడం తో అధిష్టానం ఇన్చార్జి ఎంపికపై ఆచితూచి అడుగులు వేసింది. చివరకు తంబళ్లపల్లె ప్రజల నాడి తెలిసిన మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ నాయకత్వంపై మొగ్గు చూపినట్లు తెలిసింది. శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతి నుండి తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ ను ఎంపిక చేస్తూ ఆదివారం రాజధానికి రమ్మని పిలుపు అందింది. మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ తో పాటు ఆరు మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులు, క్రియాశీలక నాయకులకు పిలుపు వచ్చింది. తంబళ్లపల్లె నుండి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరిశ్రీనివాసులుతో ఆరు మండలాల నాయకులు అమరావతికి తరలి వెళ్లారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :