Sunday, 26 July 2026 07:00:00 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

గ్రామీణ ప్రాంతాలలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి అపూర్వ స్వాగతం - వైకాపా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కిషోర్ కుమార్ రెడ్డి

Date : 25 June 2026 10:46 PM Views : 100

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 25 : తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి మండలంలోని కోసువారిపల్లి, పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లి తో పాటు పలు మారుమూల గ్రామాలలో ప్రజలు అపూర్వ స్వాగతం పలికినట్లు వైకాపా యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే ప్యాయలవారిపల్లి లో నల్లపరెడ్డి దాయాదుల గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు, ప్రజలతో మమేకమై సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు, యువత పూలమాలలు , దుశ్యాలవులతో ఘనంగా సన్మానించి స్వాగతించారు.అనంతరం ముట్రవారి పల్లెలో కృష్ణారెడ్డి తండ్రి మృతి పై ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. తదుపరి పెద్ద తిప్ప సముద్రం మండలం మద్దయ్యగారి పల్లి ఎంపీటీసీ ఖాదర్ వల్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలున్న కార్యకర్తలు తన దృష్టికి తేవాలని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వైకాపా కార్యకర్తలకు అండగా నిలవడంతోపాటు వారి కష్ట నష్టాలలో పాలుపంచుకొని చేయూతనిస్తానన్నారు. వైకాపా పాలనలో తంబళ్లపల్లె నియోజకవర్గం లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైకాపా నాయకులు, కార్యకర్తలు గతంలో నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, ఎర్రగుండ్లపల్లి శివారెడ్డి, మండల వైకాపా అధ్యక్షుడు చౌడేశ్వర, వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: