నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 07 : తంబళ్లపల్లె వారపు సంత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్వహించాలని కూటమి నాయకులు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ కు వినతిపత్రం ఇచ్చారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం క్రాస్ రోడ్ మదనపల్లి, ములకలచెరువు, పెద్దమండెం రహదారులకు కూడలిగా నిలిచింది.నిత్యం వందలాదిగా ఆర్టీసీ తో పాటు ప్రైవేటు వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు,వేలాదిగా జన సంచారంతో కిటకిటలాడుతుంది. కొందరు ఈ రోడ్డు ప్రక్కనే కూరగాయల దుకాణాలు తోపాటు పలు రకాలు దుకాణాలు నిర్వహణతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుమార్లు ట్రాఫిక్ స్తంభించి వాహనాలు నిలిచిన సంఘటనలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం పాత జూనియర్ కాలేజ్ వెనుక వారపు సంతకు స్థలం కేటాయించిందని ఆ స్థలంలో సంత నిర్వహించాలని కూటమి నాయకులు సుగవాసి శివకుమార్, ఆకుల రెడ్డప్ప రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మణి, కూటమి నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు.
Reporter
Namitha News