నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 02 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించింది. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలపై నిర్వహించిన ఇండియా టుడే బెస్ట్ కాలేజెస్ 2026లో మిట్స్ విశిష్ట స్థానం సంపాదించిందని యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను కలిపి నిర్వహించిన ర్యాంకింగ్స్‌లో మిట్స్ దేశవ్యాప్తంగా 187వ ర్యాంకును సాధించగా, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల విభాగంలో దేశవ్యాప్తంగా 155వ ర్యాంకును కైవసం చేసుకుంది అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ జాతీయ స్థాయి గుర్తింపు మిట్స్‌లో అందిస్తున్న నాణ్యమైన విద్య, అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశోధనకు ప్రాధాన్యత, పరిశ్రమలతో అనుసంధానమైన బోధన, ప్రతిభావంతులైన అధ్యాపక బృందం మరియు ఉత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలకు నిదర్శనమని తెలిపారు. ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్, ఎం.టెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ మరియు పీహెచ్.డి. కోర్సులలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి అని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును మిట్స్‌తో నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు
Reporter
Namitha News