నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 24 : తంబళ్లపల్లె మండలంలోని ప్రతి గ్రామీణ ప్రాంత తాగునీటి వనరుల నాణ్యత పరీక్షలపై పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ ఆధ్వర్యంలో గ్రామాలలో నీటి నాణ్యత పరీక్షలపై కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం జరిగింది.ఎఈఈ మాట్లాడుతూ పంచాయతీలకు నీటి నాణ్యత పరీక్షల కోసం పి టి కె కిట్ అందిస్తామని దాని ద్వారా ప్రతిరోజు తాగునీటి ట్యాంకు లోని నీటిని, 15 రోజులకు ఒక మారు ప్రతి ఇంటి లోని నీటిని, నెలకు ఒక మారు పాఠశాలలు, అంగన్వాడీలు, కార్యాలయాలలోని నీటిని పరీక్షించాలన్నారు. ఈ పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. తాగునీటి వనరులు నాణ్యత పరీక్షల నిర్లక్ష్యం వహించరాదని తాగునీటి కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు ప్రసాద్, మారుతీ కుమార్, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News