నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - మార్చి 08 : అన్నమయ్య జిల్లాలో కురబల కోట లో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకొంది. కురబలకోట మండలం ముదివేడు లో నేడు జరుగుతున్న దండుమారెమ్మ జాతర కు బంధువుల ఇంటికి వచ్చిన బంధువులు. ఇంట్లో ఉయ్యాలకు విద్యుత్ షాక్ కొట్టి ఇద్దరు మృతి చెందగా, ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. మృతులు చిత్తూరు మండలం కొంగారెడ్డి పల్లి కి చెందిన వెంకటేష్ 33 సం, బెంగళూరు లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ స్నేహితుడి ఇంటికి వచ్చి మృత్యువాత.. మృతిచెందిన మరో మహిళ పద్మావతమ్మ 55సం పుంగనూరు మండలం గొల్లపల్లి కి చెందిన మహిళ బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత... ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముదివేడు పోలీసులు దర్యాప్తు లో మరిన్ని విషయాలు వెల్లడించాల్సి ఉంది
Admin
Namitha News