నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 31 : సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో అల్యూమిని మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ నందు చదువుకున్న పూర్వ విద్యార్థులు హాజరైనారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో మరియు ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్ రూపకల్పనలో అల్యూమిని విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పరిశ్రమల్లో స్థిరపడిన అల్యూమిని విద్యార్థులు తమ అనుభవాలు, నైపుణ్యాలు, కెరీర్ మార్గదర్శకత్వాన్ని ప్రస్తుత విద్యార్థులతో పంచుకోవడం ద్వారా వారికి సరైన దిశానిర్దేశం లభిస్తుందని అన్నారు. అలాగే ఇంటర్న్‌షిప్స్, ప్లేస్‌మెంట్స్, స్టార్టప్ అవకాశాలు, పరిశోధన కార్యకలాపాల్లో తమ సహకారం సంస్థకు మరింత బలాన్నిస్తుందని పేర్కొన్నారు. అల్యూమిని మరియు యూనివర్సిటీ మధ్య బలమైన అనుబంధం కొనసాగితే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, సమాజానికి ఉపయోగపడే నాణ్యమైన ఇంజినీర్లను తయారు చేయడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అల్యూమిని విద్యార్థిని లీల శ్రీ మాట్లాడుతూ తమ ఉద్యోగ జీవితానికి బలమైన పునాదిని అందించిన మిట్స్ యూనివర్సిటీ మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకుల నాణ్యమైన బోధన, ఆధునిక ల్యాబ్ సౌకర్యాలు తమను పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దాయని అన్నారు. ప్రస్తుత విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో కూడా సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్రీదేవి, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత, కోఆర్డినేటర్ వి.గీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News