Monday, 27 July 2026 03:12:10 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రణరంగంగా మారిన తెలుగుదేశం అభిప్రాయం సేకరణ సమావేశం

పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మార్పు విషయం గా దాడి

Date : 13 July 2026 09:57 PM Views : 95

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తిరుపతి - జూలై 13 : పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు రెడ్డి వర్గం దాడిలో పలువురికి గాయాలు. ... దాడిలో తీవ్రంగా గాయపడిన టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ. తిరుపతి హోటల్ గ్రాండ్ రీచ్ లో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి పుంగనూరు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు, అలాగే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, శాప్ చైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు రెడ్డి అలాగే ఇన్చార్జి రేస్ లో ఉన్న మధుసూదన్ నాయుడు, లక్ష్మీపతి రాజు తమ అనుచరులతో హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే చల్లా బాబు రెడ్డి వర్గం మధుసూదన్ నాయుడు వర్గమైన ముల్లంగి వెంకటరమణా పై అక్కడే ఉన్న గాజు ఫ్లవర్ వాస్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో వెంకటరమణాకు తల పగలడంతో తీవ్ర రక్తస్రావమై స్పృహ లేకుండా పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడ ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం ఎలా ఉంది. అక్కడ ఉన్న చల్లా బాబు రెడ్డి అలాగే మధుసూదన్ నాయుడు అలాగే లక్ష్మీపతి రాజు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు ప్రయత్నించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటన కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ చల్లా బాబు వర్గం మీడియాపై దాడి చేసి రికార్డ్ చేసిన వీడియోలు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు కూడా అక్కడే ఉన్న మంత్రులు సమాధానం చెప్పాలని కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తేవడంతో సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :