నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 3 కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు - హాజరవుతున్న మంత్రులు,అతిరథ మహారథులు - షేర్ హోల్డర్లు,డిపాజిటర్లు,ఖాతాదారులు,ప్రజలు హాజరై జయప్రదం చేయాలి - టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,డైరెక్టర్లు పిలుపు డిసెంబర్ 3న మదనపల్లె కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని మదనపల్లి కో - ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ పిలుపునిచ్చారు.శనివారం స్థానిక ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపంలో బ్యాంకు డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యా సాగర్ మాట్లాడుతూ వంద సంవత్సరాల వేడుకలకు బ్యాంకు షేర్ హోల్డర్లు,డిపాజిట్ దారులు,ఖాతాదారులు,ప్రజలు,ప్రముఖులు,విద్యావంతులు వ్యాపారులు,రాజకీయ నాయకులు,ప్రజాప్రతినిధులు హాజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.డిసెంబర్ 3వ తేదీ (బుధవారం) మదనపల్లె పట్టణం బుగ్గ కాలువలో గల ఎన్.వి ఆర్ కళ్యాణ మండపం నందు ఉదయం పదిన్నర గంటలకు జరగనున్న శతజయంతి ఉత్సవాలకు మంత్రులు,శాసనసభ్యులు,అతిరథ మహారధులను ఆహ్వా నించడం జరిగిందని,వారందరూ హాజరవుతారన్నారు.పుర ప్రజలు,షేర్ హోల్డర్స్,ఖాతా దారులు,డిపాజిట్ దారులు విశ్వాసం,సహకారంతో వందేళ్లు పురోభివృద్ధిలో ముందుకు సాగిందని తెలిపారు.రానున్న రోజుల్లో టౌన్ బ్యాంకుకు మరిన్ని బ్రాంచిలను ఏర్పాటు చేసి,ఖాతాదారులకు మొరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.వందేళ్ల ప్రయాణంలో టౌన్ బ్యాంకు సామాన్య,పేద,మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా ఆదుకున్న చరిత్రని సొంతం చేసుకుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కో- ఆపరేటివ్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని,స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుడా బ్యాంకు అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు.బ్యాంకు వైస్ చైర్మన్ మరియు పలువురు డైరెక్టర్లు మాట్లాడుతూ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.ఈ వేడుకలకు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.వందేళ్ల ప్రయాణంలో టౌన్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి బాసటగా నిలిచి,వారి అభివృద్ధికి తోడ్పడిందని గుర్తు చేశారు.కావున ఈ ఉత్సవాలకు ప్రజలు పుర ప్రముఖులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Reporter
Namitha News