నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 26 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎం.సి ఏ విభాగము వారు జాతీయ స్థాయి ఆర్టికల్ ప్రెసెంటేషన్, పేపర్ పబ్లికేషన్స్ మరియు మేధో సంపత్తి హక్కుల (IPR) ప్రాముఖ్యత అనే అంశంపై రెండు రోజుల వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు రాష్ట్రం, తంజావూరు లోని పెరియార్ మణియమ్మై ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నందు డైరెక్టర్- రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ పబ్లికేషన్స్, ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ బాలాకుమార్ పిచాయ్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ నందు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కుమారన్ షణ్ముగం, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మరియు యూనివర్సిటీ అడ్వైసర్ ఆర్&డి డాక్టర్ ఆర్. తులసి రామ్ నాయుడు లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బాలాకుమార్ పిచాయ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యా ప్రయాణం ప్రారంభ దశలోనే పరిశోధన, రచనా నైపుణ్యం, మరియు విజ్ఞానాన్ని పంచుకునే అవకాశం కలిగే ప్రక్రియలపై అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు. వెబ్ ఆఫ్ సైన్స్- ఎస్.సి.ఐ-టైర్-1 జర్నల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, కఠినమైన సమీక్ష ప్రక్రియను అనుసరించే అత్యున్నత నాణ్యత గల పరిశోధనా పత్రికలుగా పేర్కొన్నారు. ఈ జర్నల్స్‌లో ప్రచురితమైన పరిశోధనలకు ప్రపంచ స్థాయిలో విశ్వసనీయతతో పాటు అకాడెమిక్ విలువ ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. అలాగే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది ఒక జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనలకు ఎంత స్థాయిలో ఇతర పరిశోధకులు సూచనలు ఇస్తున్నారో చూపించే ముఖ్యమైన ప్రమాణమని వివరించారు. ఎక్కువ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్న జర్నల్స్ నాణ్యత, విశ్వసనీయత, ప్రభావాన్ని సూచిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కుమారన్ షణ్ముగం మాట్లాడుతూ మేధో సంపత్తి హక్కులు ప్రాముఖ్యత, పేటెంట్లు, కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్స్, డిజైన్ హక్కులు వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు,ఐ.పి.అర్ కు సంబంధించిన వివాదాలు, చట్టపరమైన సమస్యలు, పరిష్కార విధానాలను నిజ జీవిత ఉదాహరణలతో వివరించారు. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అందించే దూరవిద్యలో వైవిధ్య కోర్సుల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ అవకాశాలు, వాటి ఉపయోగాలు మరియు నమోదు విధానాలను వివరించారు. ఒక స్టార్టప్ కంపెనీ లో ప్రైవేట్ పెట్టుబడి ఐడియాలను ఎలా సమర్థవంతంగా ప్రెజెంట్ చేయాలి, రీసెర్చ్ ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా ఎలా మలచాలి, స్టార్టప్ పిచింగ్‌లో పాటించాల్సిన ముఖ్యాంశాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్, డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్స్ డాక్టర్ కె.రాధికా, డాక్టర్ కే.నిర్మలా దేవి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News