Sunday, 26 July 2026 08:05:56 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

హనుమాన్ జయంతి వేడుకల్లో మంత్రి ఆనం

Date : 13 May 2026 11:19 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు : హనుమాన్ జయంతి సందర్భంగా ఆత్మకూరులోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరయ్యారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు. కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయ పూజారులు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు నేతలు పట్టణ ప్రజలు భక్తులు భారీగా పాల్గొన్నారు.పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.. ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ దేవాలయ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని మంత్రి ఆనం తెలిపారు.ఆనం కుమార్తె లీలా కైవల్యా రెడ్డి, వారి మనవళ్ళ తో మంత్రి ఆనం ఈ కార్యక్రమానికి పాల్గొనడం విశేషంగా అలరించింది. టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్ర రెడ్డి, బిజెపి కుటుంబ సుధాకర్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జనార్దన్ నాయుడు, నరసింహారెడ్డి తదితరులతోపాటు అశేష భక్తజనం ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.. ఆంజనేయ స్వామి భారీ విగ్రహానికి డోన్ ద్వారా పాలాభిషేకం చేయడం విశేషంగా ఆకట్టుకుంది.. ఈ దేవాలయంలో ఆంజనేయస్వామి మహత్యంతో ఇక్కడికి భారీగా భక్తులు వస్తున్నారని వారి ఆశీస్సులతో దినదినభివృద్ధి చెందుతుందని దేవాదాయ శాఖ నుండి ఈ ఆలయానికి కావలసిన అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తామని రాష్ట్రంలో పురాతన ఆలయాల మరమ్మత్తుల కోసం మరియు శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ పూర్తిగా కృషి చేస్తుందని మంత్రి ఆనం తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :