నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 20 ః తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో స్పెషలాఫీసర్ అమరనాథరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో పెంచుతున్న పెరటి తోట నేడు అందరికీ ఓ రోల్ మోడల్ గా నిలిచింది. మంగళవారం అగ్రికల్చర్ ఆఫీసర్ (డి ఆర్ సి) రామకృష్ణరాజు ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ ఫీల్డ్ విజిట్ లో భాగంగా మోడల్ స్కూల్ పెరటి తోటను సందర్శించి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై చూపిస్తున్న చొరవ స్పెషలాఫీసర్ అమరనాథరెడ్డి లాంటి అధికారుల ప్రోత్సాహం, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది పనితీరు అభినందనీయమని ప్రతి పాఠశాల ఓ ప్రకృతి వ్యవసాయ పెరటి తోట కావాలని ఆకాంక్షించారు. ఇదే స్ఫూర్తితో మండలంలోని ఎఫ్ఎం టి సిబ్బంది ప్రకృతి వ్యవసాయం సాగుపై దృష్టి సారించి మానవాళి ఆరోగ్యం తో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషితో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, ఎఫ్ ఎం టి రఘునాథ్, ఎన్ ఎఫ్ ఏ సునీత, ఎఫ్ ఎం టి రాజు, ఎన్ ఎఫ్ ఎఫ్ రుక్మిణి,ఐ సి ఆర్ పి లు నిజాముద్దీన్, రెడ్డప్ప,సునీత, ఆర్సియా భాను, శారద, సిద్ధమల్లు, సుజాత, పద్మజ, సుకన్య, బయమ్మ లు పాల్గొన్నారు
Reporter
Namitha News