Monday, 27 July 2026 02:42:26 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

దివంగత నేత వాజ్ పాయ్ విగ్రహ ప్రతిష్టకు తరలిరండి - చల్లంపల్లె నరసింహారెడ్డి

Date : 10 December 2025 04:15 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 10 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేంద్రంలోని శ్రీనివాసాపురం రోడ్డులోని దుర్గలమ్మ ఆలయ ప్రాంగణంలో బిజెపి జాతీయ నాయకులు చల్లంపల్లె నరసింహారెడ్డి గురువారం బిజెపి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన బిజెపి కార్యకర్తలతో మాట్లాడుతూ భారతదేశానికి పాలనా సంస్కరణల ప్రధాత దివంగత అటల్ బిహారి వాజ్ పాయ్ విగ్రహ ప్రతిష్ట,ఆవిష్కరణ ఈ నెల 14 వతేదీన ఆదివారం మదనపల్లెలో జరిగే కార్యక్రమానికి బిజెపి నాయకులు, కూటమి నాయకులు, అభిమానులు పెద్దఎత్తున తరలి రావాలన్నారు .దేశంలో బిజెపి బలోపేతానికి దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ చేసిన కృషి వర్ణనాతీతమని, అలాంటి నాయకుడు విగ్రహ ప్రతిష్ట మదనపల్లి లో ఏర్పాటుచేసుకోవడం మన అదృష్టమన్నారు. నా విషయంలో ఒక సంఘటన జరిగిందని నేను హైదరాబాద్ నుండి ఢిల్లీ కి వాజ్ పాయ్ కలవడానికి వెళ్ళానని అప్పుడు ఆయన చివరి దశలో ఉన్నారని అప్పుడు వారి సిబ్బంది వచ్చి సార్ కలవడం కుదరదని రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పారు. మేము గేట్ దగ్గరకు వేళ్ళగానే సిబ్బంది వచ్చి మీతో ఆయన మాట్లాడాలని చెప్పారన్నారు. వెంటనే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు కదా నన్ను కలవడానికి ఇంతదూరం వచ్చి నాతో మాట్లాడక పోవడం మీకు కొంత కలతగా ఉంటుందని మాతో అన్నారని. అలాంటి మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఇలాంటి వారు కోటికి ఒక్కరు జన్మిస్తుంటారన్నారు. అలాగే మండలంలోని శ్రీ సుబ్రమన్యేశ్వర హెచ్ పి గ్యాస్ గోడౌన్ దగ్గర బిజెపి సీనియర్ నాయకులు చల్లంపల్లె నరసింహా రెడ్డి, గ్యాస్ డీలర్ గబ్బురి మధుసూదన్ చేతులు మీదుగా ఉజ్వల పథకం ద్వారా మహిళలకు సిలిండర్, స్టవ్ లు, రెగ్యులటర్ లు పంపిణీ చేశారు.ఈ సమావేశంలో చల్లంపల్లె నరసింహారెడ్డి, ఫరీద్ ఖాన్, ఇంజం ఆనంద్, బిజెపి కృష్ణమూర్తి, చంద్రారెడ్డి,సాఫ్ట్ వేర్ కుమార్ నాయుడు, ద్వారకనాథ్ రెడ్డి, మణికంఠ రెడ్డి, డాక్టర్ నవీన్, శేఖర్, సుబ్రహ్మణ్యం, వీరకుమార్ నాయుడు, చలపతి, శ్రీరాములు, రాము తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: