నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య మదనపల్లి జిల్లా.... మదనపల్లి ని జిల్లా గా మార్చాలని మదనపల్లి జిల్లా కోసం కొనసాగుతున్న పోరాటం - బీఎస్‌పీ, సిపిఐ నేతల నిరసన! మదనపల్లిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ (BSP) మరియు ఇతర ప్రజా సంఘాలు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అన్నమయ్య జిల్లా పేరును తాము గౌరవిస్తామని, అయితే మదనపల్లి ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యత దృష్ట్యా మదనపల్లి జిల్లా పేరునే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ మదనపల్లి జిల్లా ఏర్పాటు కేవలం పరిపాలనా పరమైన అంశం మాత్రమే కాదని, అది ఇక్కడి ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో BSP నాయకులు కార్యకర్తలు సిపిఐ నాయకులు ఇతర కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News